
◽ “వైసీపీ మళ్ళీ వస్తుందో,రాదో తెలియదు కానీ వైసీపీ అధికారం లోకి తేచ్చేవరకు నిద్రపోయేలా లేరుగా టీడీపీ శ్రేణులు “❓
అమరావతి : పాయింట్ అవుట్ న్యూస్ :
అసలు ” రాజకీయం అంటే ఏంటీ సార్…. ❗
హడావిడిగా అందరిని లోపల వేసేయ్యాలా❓
చంద్రబాబు నాయుడు రాజకీయం చెయ్యట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. నారా లోకేష్ దూర దృష్టి తో వెళ్తున్నాడు అని కార్యకర్తలు ఆలోచన చేయడం లేదు ఎందుకో… గతంలో జగన్ మోహన్ రెడ్డి లాగా మూర్ఖత్వం తో చేస్తే… 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పు అందరికి తెలిసిందే… టీడీపీ కూడ అది దృష్టిలో పెట్టుకొనిమలుచుకోవాలి..టీడీపీ కార్యకర్తలు దిగువ శ్రేణు నాయకులు పొద్దున లేచిన దగ్గర నుంచి ఒకటే ఆవేదన….నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయాలి… రోజుకు ఒకరిని లోపల వెయ్యాలి…. కొట్టాలి తిట్టాలి కేసులు పెట్టి ఇరికించాలి.గడిచిన 45 రోజుల్లోనే ఏర్పాటు అయినా కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశ గా అడుగులు వేస్తుంది… రాజకీయం మొదలు పెట్టింది… టీడీపీ లో కొందరు కార్యకర్తలు ఆవేశం, ఆవేదన, ఆక్రోశ్యం చూస్తుంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేత గాని ప్రభుత్వం అని…. వైసీపీ వాళ్ళను ఏమి పీకలేరు అని తెగ గింజకుంటున్నారు…. కార్యకర్తలు ఊహించిన విధంగా జరగాలంటే అది ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా లో ఒక్క పోస్ట్ పెట్టినట్లు, ఆవేదన వెళ్ళగక్కినంత వాట్సాప్ లో మెసేజ్ పెట్టినంత తేలిక కాదు. జనాలకి కూటమి పరిపాలన అందించాలి… అభివృద్ధి చేయాలి… సంక్షేమ పధకాలు చూసుకోవాలి రాజకీయం చేయాలి…
◽ కార్యకర్తలకి తమను గ్రామ స్థాయి లో ఇబ్బంది పెట్టిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని, తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో తమకి అనుకూలంగా ఉండే అధికారి అందుబాటులో ఉండాలని, ఆర్ధికంగా గత ఐదు సంవత్స రాలు నలిగి పోయి , ఆర్ధికంగా ఇబ్బంది పడిన కాస్త ఆర్ధికంగా బలం గా అవ్వాలని కోరుకుంటన్నా మాట పచ్చి నిజం… కానీ ప్రభుత్వం ఏర్పాటు తోనే తక్షణమే పైన తెలిపిన అంశాలు ఆచరణలోకి రావు… సమయం పడుతుంది.. పైగా పూర్తి స్థాయి టీడీపీ ప్రభుత్వం కాదు ఏర్పాటు అయింది… కూటమి ప్రభుత్వం… అన్ని కోణాల్లో చూసుకొని కష్టపడినా కార్యకర్తల కు అవకాశం కల్పిస్తారు అనిపిస్తుంది .. దీనికి కావలసినది కేవలం కార్యకర్తలకు సహానం … రాత్రికిరాత్రి అద్భుతాలు జరిగిపోవు. హడావిడి రాజకీయం కాకుండా నిర్మాణాత్మకమైన రాజకీయం చేయాలి… భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకోవాలి..పార్టీ ఎదుగుదలను దూర దృష్టితో ఆలోచించాలి.. ప్రజా పాలను నడిపిస్తూ, రాజకీయం చేయడం మెల్లగా జరుగుతుంది…..గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయం టీడీపీ కార్యకర్తలు శ్రేణులు విమర్శలు చేసే వారు… కానీ ఫలితాలు తరువాత చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైనది అని మాట మార్చారు… అలానే ఇంతకు ముందు కూడా జనసేన తో పొత్తు విషయం లో కూడా ఇలానే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారు అని గోల గోల చేశారు. బీజేపీ తో పొత్తు వద్దన్నారు. కానీ ఎన్నికలు సజావుగా జరిగిన తీరు చూసి ఎగతాళి చేసిన నోర్లు నోటిన వేలు వేసుకున్నారు….ఆ రోజు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు మాటను వినివుంటే ఈరోజు ఇలా ఘన విజయం సాధించలేమని అందరికి తెలిసిన నిజం…గతం లో కూడా NDA లో నుంచి బయట కు వచ్చే వరకు పై స్థాయి నుంచి కింద స్థాయి నాయకులు కార్యకర్తలు వరకు ఇలానే ప్రశ్నించ్చారు…చివరికి బయటకు వచ్చాక పరిస్థితి ఏమైందో అందరికి తెలుసు..23 సీట్లు తో… అసెంబ్లీ లో బిక్కు బిక్కు మంటూ ఐదు సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చాము…
🔴 ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడ ఒకటి గమనించాలి….
“రాష్టానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో రాజకీయం కూడ అంతే ముఖ్యం ” అనే విషయం గమనించాలి.
◽ సామాన్య కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకోవాలి.. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో పూర్తిస్థాయిలో ఉండేది కార్యకర్త మాత్రమే… అతని ఆవేదనలో అర్థం నూటికి నూరు శాతం ఉంది.. ఇప్పటికి వైసీపీ లో పని చేసిన కార్యకర్తలకు, చోట మోట నాయకులు కు టీడీపీ శ్రేణులు పెద్ద పీట వేస్తున్నారు అంటూ ఆరోపణలు కూడా విపరీతంగా ఉన్నాయి.. ఇటువంటి అవకాశ వాదుల పైన కూడా దృష్టి పెట్టాలి.. వైసీపీ హయాంలో నలిగిపోయినా కార్యకర్తలు లను కాదని, ఇబ్బంది పెట్టిన వారిని తీసుకొచ్చి పెద్ద పీట వేయడం కూర్చునా కొమ్మను నరుకోవడం అవుతుంది అనే విషయం గమనించాలి.కొందరు నాయకులు మంత్రుల దగ్గరకు వచ్చి చెప్పే భజన మాటలను, భజన పరులను దూరం పెట్టుకోవాలి… మంత్రుల దగ్గర పనిచేసే PRO, PA లు, కూడా వారి వారి స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వల్ల నాయకుని పై వ్యతిరేకత పెరగదు… కొందరు ఈ PRO, PA లు చేసే ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం అనడంలో ఎటువంటి సందేహం లేదు…కాబట్టి బాధ్యత గా మెలగడం మంచిది…
◽ ఇక పోతే సామాన్య కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు అనుకున్నదే జరగాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అనే వితండవాదం ఆపితే మంచిది. ఏది ఏ సమయంలో చేయాలి అనే విషయం చంద్రబాబు నాయుడు కి లోకేష్ కు బాగా తెలుసు. కాస్త ఓపిక పట్టడం వలన తప్పకుండా మంచి జరుగుతుంది. అఖండ విజయం కోసం పోరాటం చేసిన కూటమి లోని మూడు పార్టీ లకార్యకర్తలకి వారి వారి కష్టాలను గుర్తించి, వారి అర్హత ను బట్టి త్వరగా మంచి హోదాలు కల్పిస్తే పార్టీ పై నమ్మకం, నాయకుడి పై భరోసా పెరుగుతుంది.. నియోజకవర్గం లో ఎమ్మెల్యే లు కూడ ఎమ్మెల్యే ల గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలుకు గుర్తించడం లో విఫలం అవుతున్నారు… దీనిపై కూడా స్థానిక ఎమ్మెల్యే లు చొరవ తీసుకోవాలి. ఎమ్మెల్యే లు, మంత్రులు ఒకటి గుర్తు ఎరగాలి…. గత వైసీపీ ప్రభుత్వం లో ఎన్ని కష్టాలు వచ్చిన ఒత్తిడులు వచ్చినా ఎమ్మెల్యే ల గెలుపు కోసం క్లిష్ట సమయాల్లో నిలబడిన కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి…..
◽ ఏది ఏమైనా అవకాశం ఉన్నంత త్వరగా ప్రభుత్వం పూర్తి స్థాయి లో ట్రాక్ లో పడుతుంది… అలాగే ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు ఆవేదన అర్ధం చేసుకోవడం లో టీడీపీ చొరవ తీసుకుంటుంది…అలాగే కష్ట కాలం లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కు తగిన గౌరవం దొరుకుతుంది..”కార్యకర్తలు నిర్లక్ష్యం ఖరీదు వైస్సార్సీపీ పార్టీ పతనం అని గ్రహించాలి”…కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి, సంక్షేమం అంటూ కాకుండా రాజకీయం కూడా మొదలు పెడుతూంది అని ఆశిద్దాం…
వ్యాసకర్త :
✍️✍️✍️
రామకృష్ణ యడవల్లి