కనుమరుగు అవుతున్న సాంస్కృతి సంప్రదాయలను కాపాడేందుకి ముందుకు వచ్చిన “మెలబౌర్న్ మామ”

హైదరాబాద్ : పాయింట్ అవుట్ న్యూస్ : హైదరాబాద్ వేదిక గా అమెరికా -ఆస్ట్రేలియా – భారతదేశం సాంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న సమయం లో మెలబోర్న్ మామ మరియు RV 2 జాయింట్ వెంచర్ వారు హైదరాబాద్ లోని దాస్పల్ల హోటల్ వేదిక గా గొప్ప కార్యక్రమం కొరకు శ్రీకారం చుట్టారు..ప్రపంచ దేశాలు అన్ని భారత దేశం వైపు చూస్తున్న తరుణం లో, ప్రపంచం లోని అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు తెలుగు తేజమై మెరుస్తున్నారు.. శాస్త్ర సాంకేతిక, రాజకీయ కళా రంగాలలో జ్ఞాన జ్యోతులై మన ఖ్యాతిని దశదిశల వ్యాప్తింపజేస్తున్నారు.. వీరి అందరిని ఒక తాటి పై ఇచ్చేందుకు కంకణం కట్టుకుంది మెల్బోర్న్ మామ అనే సంస్థ.

ఈ సంస్థ ద్వారా తెలుగు వారి ఖ్యాతి నీ, టాలెంట్ ను ఎక్కడ ఉన్న పట్టుకొని ఒక తాటి పై తెచ్చేందుకు భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచేందుకు వేదిక అయింది..తెలుగు బాష పై ఉన్న మమకారం తో తెలుగు వారి నీ ఒక దగ్గరకు చేర్చేందుకు కంకణం కట్టుకున్న ఈ సంస్థ తమ కార్యకలాపాలు హైదరాబాద్ వేదిక గా నడిపేందుకు స్వీకారం చుట్టిన సందర్బంగా ఎంతో మంది ప్రముఖులు హాజరు అయి సంస్థ యాజమాన్యాన్ని సభ్యులను కొనియాడారు..

ఈ సంస్థ భవిష్యత్ లో అమెరికా ఆస్ట్రేలియా భారత దేశం లో జరిగే పలు సాంస్కృతిక, కళ, రాజకీయ, శాస్త్ర విషయాలు పై దృష్టి పెట్టి, అలాగే దేశ విదేశాల్లో విద్య అభ్యసించే విద్యార్థుల కొరకు మంచి క్యారియర్ గైడ్ లాగా మారి, మంచి మంచి శాస్త్ర సాంకేతిక విషయాలను తమ పాడ్ కాస్ట్ ద్వారా ప్రజలోకి తీసుకెళ్లి సమాజానికి తమ వంతు సహాయం చేయడానికి ముందుకు రావడం సంతోషం అని పలువురు ప్రముఖులు కొనియాడారు.

ఈ కార్యక్రమం లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంస్థ సభ్యులు హాజరు అయ్యారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *