సచివాలయం లో కోవర్ట్ ఆపరేషన్ నడుస్తుందా ❓

సచివాలయం లో కోవర్ట్ ఆపరేషన్ నడుస్తుందా ❓

◽ ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియెట్‌లో కోవర్ట్‌ ఆపరేషన్‌ జరుగుతోందా❓

◽ కార్యాలయం లోపల ఏం జరిగినా ప్రభుత్వంలోని చాలా మంది కంటే ముందే వైసీపీకి తెలిసిపోతోందా ❓

◽ టీడీపీ నాయకుల ఆందోళన నిజమేనా ❓

◽ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో ఏం జరుగుతోంది❓

◽ ఏయే విభాగాల్లో వైసీపీ అనుకూలమైన వర్గం వారు ఉన్నట్టు ❓

అమరావతి : పాయింట్ అవుట్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కోవర్ట్‌ ప్రకంపనలు రేగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం లో వైసీపీ భజన పరులు గా పేరుపొందిన కొందరు అధికారులు ఇంకా జగన్ రెడ్డి కి ఊడిగం చేసే పనిలోనే ఉన్నట్లు ఉన్నారు..వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ లు విచారణలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇంకా తెర మీదకు రాని అంశాలు ఏమైనా ఉన్నాయా..❓ అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే అందరి దృష్టి సెక్రటేరియెట్‌ వైపునకు మళ్ళుతోంది ..సచివాలయంలో తమ భక్తులను వైసీపీ జాగ్రత్తగా ప్లాన్ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న చర్చ ప్రభుత్వ వర్గాలకు కునుకుపట్టనివ్వడం లేదని చర్చ జోరుగా సాగుతుంది..సచివాలయం లోని చాలా విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లు మొదలుకుని.. ఆ పై స్థాయి అధికారి వరకు వివిధ హోదాల్లో పాత ప్రభుత్వంలో పని చేసిన వారు ఇప్పటికీ అలాగే ఉన్నారని, అదే పోస్టింగుల్లో కొనసాగుతున్నారనే చర్చ జోరుగా ఉంది సచివాలయ వర్గాల్లో. ఫైనాన్స్, జీఏడీ, మున్సిపల్ అడ్మిన్, విద్యా శాఖ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్యం & I&PR ఇలా వివిధ విభాగాల్లోని కీలక స్థానాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ అనుకూలురు ఉన్నారని అంటున్నారు. ఆయా శాఖలకు సంబంధించి ఎలాంటి కీలక పరిణామాలు జరిగినా.. వాళ్ళు చిటికెలో వైసీపీకి సమాచారం చేరవేస్తున్నారన్న టాక్‌ బలంగా నడుస్తోంది. కొందరు వైసీపీ కి ఊడిగం చేసే అధికారుల ద్వారా ప్రభుత్వంలోని చాలా మంది ముఖ్యులకంటే ముందుగా వైసీపీ హెడ్‌ క్వార్టర్స్‌కే సమాచారం చేరిపోతోందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. దానివల్ల ఏదో అయిపోతుందని కాకున్నా.. ప్రభుత్వాన్ని తప్పు పట్టేందుకు, బద్నామ్ చేయడానికి వాడే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లల్లోనే ఉద్యోగులు వ్యతిరేకించే జీపీఎస్ జీవో.. గెజిట్ అప్లోడ్ వంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి. దాని వెనుక కుట్ర ఉందని తెలిసినా.. ఇప్పటి వరకు చర్యలూ లేవన్న అసహనం టీడీపీ అనుకూల వర్గాల్లో ఉంది. సాంకేతికంగా సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడం కుదరకున్నా.. వారిని వారి వారి స్థానాలా నుంచి పక్కకు తప్పించారా.. అంటే… అది కూడా లేదనే సమాధానమే వస్తోందట.❗ ఇలాగే ఉంటే భవిష్యత్తులో కొందరు అధికారుల తీరు వల్ల కష్టాలు తప్పవనే చర్చ జరుగుతోంది. ఇక అక్కడ ఇక్కడ అని కాకుండా.. ఏకంగా ముఖ్యమంత్రి కొలువు తీరిన ఫస్ట్ బ్లాక్ నుంచే కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చేసిన సంఘటనలూ ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి వస్తే.. ఆ విషయం ఫస్ట్ బ్లాకులో ఉన్న వారికంటే ముందుగానే వైసీపీ సోషల్ మీడియాలో వచ్చేసింది. దీన్ని చూసి ఫస్ట్ బ్లాకులో ఉండేవారే కంగుతిన్నారట. ఇక మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల పేషీల్లోనూ కొందరు గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్లు చేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెయిటింగులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి అత్యంత సమీప బంధువు ఓ కీలక మంత్రి పేషీలో ఉన్నట్టు సమాచారం.❓ తెలుగుదేశం పార్టీ నీ ,ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేశారనే అభియోగాలు ఉన్న కొల్లి రఘురామిరెడ్డి బంధువులు ఏకంగా అత్యంత కీలకమైన శాఖ మంత్రి వద్దకు చేరడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయట సచివాలయ వర్గాలు. అయితే ఆ ఐపీఎస్‌తో బంధుత్వం ఉన్నంత మాత్రాన అనుమానించాల్సిన అవసరం లేదుగానీ…. కానీ సదరు వ్యక్తి కదలికలు.. చేస్తున్న పనులే అనుమానాస్పదంగా ఉన్నాయంటున్నారు కొందరు సహచరులు..స్వయంగా ఆ అధికారి కీలక మంత్రి పేషీలో తిష్టవేయడమే కాకుండా.. తనకు పరిచయం ఉన్న వాళ్లని వివిధ మంత్రులు లేదా.. కీలక అధికారుల పేషీల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పుడిదే సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయింది.ఇలా వివిధ శాఖల్లో సెక్షన్ ఆఫీసర్లుగానూ.. వివిధ మంత్రులు.. కీలక అధికారుల పేషీల్లోనూ వైసీపీ తమకు అనుకూలమైన వారిని విధుల్లో చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతుంది అనే చర్చ జరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట టీడీపీ శ్రేణులు. అలాగే ఇంకొంత మంది కీలక అధికారుల దగ్గర పని చేసే గన్‌మెన్‌ కూడా గతంలో మంత్రుల వద్ద పని చేసిన వారేనని తెలిసింది. ❗ప్రభుత్వానికి, కీలక విచారణలకు సంబంధించి ఎక్కడైతే యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుందో.. అలాంటి అధికారుల దగ్గర తమకు అనుకూలంగా ఉండే గన్‌మెన్‌ను వైసీపీ అనుకూల అధికారులు జొప్పిస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక కీలక విచారణలు చేపట్టే ఓ ఉన్నతాధికారి చుట్టూ ఉన్న వారంతా…. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు సన్నిహితంగా ఉన్నవాళ్లేనని.. పీఎస్సార్ మనుషులే తన చుట్టూ ఉన్నారని సదరు అధికారి సైతం వాపోతున్నట్టు తెలిసింది. ఈ గన్‌మెన్‌ విషయంలో పకడ్బందీగా ప్రణాళిక రచించి.. ఆ ప్లాన్‌ను జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసే విషయంలో పీఎస్సార్ సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోందట అధికార వర్గాల్లో. ఇతర కీలక అధికారుల వద్ద కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉందట. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సెక్రటేరీయేట్టులోనూ.. తమ మనుషులు ఉండేలా వైసీపీ వేసిన స్కెచ్‌ చూసి టీడీపీ వర్గాలకు మతి పోతోందట. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో బలపడుతోందని అంటున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లోనే సెక్రటేరియెట్‌లోనికీలక విభాగాల్లో పని చేస్తున్న 30 నుంచి 40 మందిని బదిలీ చేసిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

సెక్రటేరియెట్‌లో వీలైనంత త్వరగా ప్రక్షాళన చేపట్టకుంటే కష్టాలు కోరితెచ్చుకున్నట్టేననే చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో.

✍️✍️✍️

సచివాలయం లో కోవర్టులు ❓

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *